![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -238 లో.....సూర్య తన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని ఇంటికి వచ్చి ఏడుస్తాడు. ఎవరో గంగ ఎదురు వస్తే అంతా మంచే జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఏమైందని శకుంతల అంటుంది. ఎవరో మోసం చేస్తే దానికి గంగని అంటావేంటని పెద్దసారు అంటాడు. మంచి అయితే తనకి ఇస్తారు.. చెడు అయితే కూడా ఇవ్వాలి కదా అని శకుంతల అంటుంది. అప్పుడే రుద్ర వస్తాడు. రుద్ర రాగానే సూర్య తనని పట్టుకొని ఎమోషనల్ అవుతాడు. నేను ఫెయిల్ అయ్యాను అన్నయ్య అని ఏడుస్తాడు. నేను ముందే చెప్పాను సూర్య వల్ల కాదని అని ఇషిక అంటుంది .
ఏదో జరిగిందని ఇలా డీలా పడిపోతే ఎలా.. నువ్వు చేయాల్సింది ఏడ్వడం కాదు ధైర్యంగా పోరాడటం.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టు ప్రాజెక్ట్ తో అందరు సపోర్ట్ చేస్తారని రుద్ర సజెస్ట్ చెయ్యగానే సూర్య ఒక పోస్ట్ పెడతాడు. ఆ తర్వాత శకుంతల దగ్గరికి వీరు వచ్చి మాట్లాడతాడు. అత్తయ్య ఈ ఇంటి ఆడపడుచు గురించి చెప్తారా అని అడుగుతాడు. వద్దు వీరు ఆ టాపిక్ గురించి తియ్యకని శకుంతల అంటుంది. మరుసటి రోజు సూర్య బాబు అనుకున్నది జరగాలని గంగ దేవుడికి మొక్కుకుంటుంది. అప్పుడే సూర్య హ్యాపీగా హాల్లోకి వచ్చి సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ తో అందరు నాకు సపోర్ట్ గా ఉన్నారు.. థాంక్స్ అన్నయ్య చాలా మంది ప్రాజెక్ట్ తో రెడీ అన్నారని చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కంగ్రాట్స్ సూర్య అని రుద్ర చెప్తాడు. మనం గుడికి వెళదామని పెద్దసారు అనగానే మొన్నే అలా జరిగింది వద్దని శకుంతల అంటుంది. లేదు వెళ్తామని పెద్దసారు అనగానే నా మాట ఎప్పుడు విన్నారు గనుక అని శకుంతల కోపంగా లోపలికి వెళ్తుంది.
ఆ తర్వాత గంగ, రుద్ర, పెద్దసారు ముగ్గురు గుడికి వెళ్తారు. అదే గుడికి విశ్వనాథ్, సుధా, వస్తారు. విశ్వ నాథ్ ట్రెయినింగ్ చేస్తున్న అబ్బాయి ధీరజ్ కూడా వస్తాడు. గంగ కొబ్బరికాయలు కొడుతుంది. అందులో ఒక కొబ్బరి ముక్క పక్కన పడుతుంది. అదే సమయంలో సుధా అటుగా వస్తూ కాలు వెయ్యబోతుంటే గంగ కాలు వెయ్యకుండా ఆపుతుంది. దాంతో థాంక్స్ అమ్మా అని సుధా చెప్తుంది. ఆ తర్వాత పెద్దసారు ఒక దగ్గర కూర్చొని ఉంటాడు మరొక పక్కన విశ్వనాథ్ కూర్చొని ఉంటాడు. ఎవరో పాప తప్పిపోయిందని రుద్ర వాళ్ళు వెతుకుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |